భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షం ఒక్కసారిగా రావడంతో భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది.

  • Published By: vamsi ,Published On : April 8, 2019 / 08:48 AM IST
భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

Updated On : April 8, 2019 / 8:48 AM IST

హైదరాబాద్‌లో భారీ వర్షం ఒక్కసారిగా రావడంతో భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం ఒక్కసారిగా రావడంతో భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది. సోమవారం(8 ఏప్రిల్ 2019) మధ్యాహ్నం సమయంలో ఎండ ఒక్కసారిగా తగ్గిపోయి.. వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షంతో నగరంలో రోడ్లపై నీరు భారీగా పారింది.

దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిలో చిక్కుకొని వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, అమీర్‌ పేట్‌, ప్రగతి నగర్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్‌, బోరబండ, మోతీనగర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు