దిశ కేసు : ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా లేదా
ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు

ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు భద్రపర్చాలని ఆదేశించింది. దీంతో నలుగురి మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కడసారి చూపుకోసం మృతుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలతో దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల్ని మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజ్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో… భారీ బందోబస్తు నడుమ డెడ్‌బాడీలను తీసుకొచ్చారు. ఇతర మృతదేహాలతో కలిసిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాంధీ మార్చురీలోని 7, 8, 9, 10 నంబర్ ఏసీ ఫ్రీజర్లలో భద్రపర్చారు. మరోవైపు నిందితుల మృతదేహాల అప్పగింతకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. శుక్రవారం(డిసెంబర్ 13) వరకు మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కోర్టు పరిశీలించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై.. బుధవారం(డిసెంబర్ 11,2019) సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.
ఎన్‌కౌంటర్ జరిగిన నాలుగు రోజులు దాటిపోయినా మృతదేహాల్ని అప్పగించట్లేదంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మృతదేహాల్ని ఇచ్చేస్తే అంత్యక్రియలైనా చేసుకుంటామని బతిమాలుతున్నారు. మృతదేహాల్ని ఇన్నాళ్లు ఉంచుకున్నా… కోపం తీరలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చెన్నకేశవులు భార్య రేణుక. తమపై కక్ష కడుతున్నారంటూ మండిపడింది. తమ బిడ్డకు కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికైనా మృతదేహాలను అప్పగించాలంటూ వేడుకుంటున్నారు శివ తండ్రి రామయ్య. మొత్తంగా దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింత వాయిదా, అలాగే సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.