నేను సైతం : సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం

  • Published By: chvmurthy ,Published On : October 26, 2019 / 03:31 PM IST
నేను సైతం : సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం

Updated On : October 26, 2019 / 3:31 PM IST

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొంది, తాను కూడా ఎంతో కొంత సహాయం చేయాలనుకుని ముందుకు వచ్చాడు ఓ హైదరాబాదీ. అనుకున్నదే తడువుగా  సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలు విరాళం అందించాడు. 

హైదరాబాద్ కు చెందిన గగన్ దీప్ సింగ్ కోహ్లీ గత కొన్నేళ్లుగా కేటీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూస్తున్నాడు. ఆపదలో ఉన్న వందలాది మందికి మంత్రి కేటీఆర్ సొంత నిధులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిధులు ఇచ్చి ఆదుకుంటున్న తీరుతో ఈ విరాళం అందిస్తున్నట్లు గగన్ దీప్ చెప్పాడు.

శనివారం అక్టోబరు 26న గగన్ దీప్  కేటీఆర్ ను కలిసి 25 లక్షల రూపాయల చెక్ ను అందచేశాడు. ఈ విరాళం ద్వారా వికలాంగులకోసం ఏర్పాటైన ప్రత్యేక పాఠశాలలు లేదా పేద విద్యార్ధుల కోసం ఉపయోగించాలని గగన్ దీప్ కేటీఆర్ ను కోరారు.