వన్ నేషన్ – వన్ టాగ్ మిషన్ : శంషాబాద్‌లో ఫాస్టాగ్‌ కారు పార్కింగ్‌

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 02:15 AM IST
వన్ నేషన్ – వన్ టాగ్ మిషన్ : శంషాబాద్‌లో ఫాస్టాగ్‌ కారు పార్కింగ్‌

Updated On : November 18, 2019 / 2:15 AM IST

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం (నవంబర్ 17, 2019) నుంచి ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’ ప్రారంభించినట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. వన్ నేషన్ – వన్ టాగ్ మిషన్, ప్యాసింజర్ ఈజ్ ప్రైం కార్యక్రమం కింద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఈ ఫాస్టాగ్‌ను ప్రారంభించారు. మొదట కేవలం ICICI ఫాస్టాగ్‌లతో మాత్రమే ప్రారంభించగా, రాబోయే రోజుల్లో ఇతర బ్యాంకులకూ విస్తరించనున్నారు. ఫాస్టాగ్ లేని వాహనాలు ఎప్పటిలాగే పార్కింగ్ ఉపయోగించుకోవచ్చు.

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు CEO ఎస్జీకే కిశోర్ మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి శంషాబాద్ విమానాశ్రయంలో ఫాస్టాగ్ కార్ పార్కింగ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా కార్ల పార్కింగ్‌ సులభతరం కానుందన్నారు. డిజిటలైజేషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియ కాలుష్యాన్ని నివారింస్తుందని తెలిపారు. అంతేకాదు తమకు భాగస్వాములుగా చేరిన NPCI కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఆటోమేటిక్ విధానంలో కస్టమర్లు తమ ప్రిపెయిడ్ అకౌంట్ లింక్ ఉన్న ఫాస్టాగ్ కొనాల్సి ఉంటుంది. దీంతో సబ్‌స్ర్కైబ్ చేసేవారు క్యాష్, క్రెడిట్ వినియోగించాల్సిన అవసరం లేకుండా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ చేయగానే పూర్తివివరాలు డాటాబేస్‌లో రికార్డు కావడంతో చోరీలకు అవకాశం ఉండదు. దీంతో మనకు వచ్చే క్రేడిట్, డెబిట్ అకౌంట్లకు వేరే పేర్లు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా సులభంగా చేసుకోవచ్చు.