US స్పేస్ క్యాంప్ లో హైదరాబాద్ అబ్బాయి

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 07:28 AM IST
US స్పేస్ క్యాంప్ లో హైదరాబాద్ అబ్బాయి

Updated On : May 1, 2019 / 7:28 AM IST

హైదరాబాద్ నగరానికి చెందిన రోహిత్ తిరుమల శెట్టి అనే విద్యార్థి.. అమెరికా స్పేస్ క్యాంప్ కు సెలక్ట్ అయ్యాడు. అమెరికాలోని హనీవెల్ లీడర్ షిప్ ఛాలెంజ్ అకాడెమీలో లైఫ్ టైమ్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ లో పాల్గొన్న 17 మంది విద్యార్థుల్లో రోహిత్ తిరుమలశెట్టి ఒకరు. 41 దేశాలకు చెందిన 292 మంది స్టూడెంట్స్ లో హైదరాబాద్ నుంచి ఎంపికైన ఒకే ఒక్కడు రోహిత్. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 8 మంది విద్యార్థులతో యుఎస్ స్పేస్ క్యాంప్ లో  పాల్గొన్నాడు. 
Also Read : తెలివైన భార్య డేంజర్: ఆనంద్ మహేంద్ర ట్వీట్: షాక్ ఇచ్చిన భార్య

హాంటిస్ విల్లే, అలబామాలోని యుఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ లో రెండు వారాలు లీడర్ షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. ఇందులో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాత్ కెరీర్స్ రియల్ టైమ్, కోడింగ్, ఖగోళ శాస్త్రం వంటి సబ్జెక్ట్ చెబుతారు. చాలా కొద్ది మందికే ఇలాంటి అవకాశం లభిస్తుందని.. అందులో ఒకడిని కావటం ఆనందంగా ఉంది అంటున్నాడు రోహిత్.

16 నుంచి 18 సంవత్సరాల వయస్సు విద్యార్ధులు పాల్గొనే ఈ టీమ్స్ లో అనేక సవాళ్లు కూడా ఉంటాయి. వీటిని దాటుకుని  కోడింగ్, రాకెట్లు పరీక్షించడం, వ్యోమగామి ట్రైనింగ్, షటిల్ మిషన్స్, మూన్ వాక్ వంటి కార్యక్రమంలో స్వయంగా పాల్గొనటమే కాకుండా స్పేస్ టెక్నాలజీపైనా అవగాహన కల్పిస్తారు. 2019తో హనీవెల్ లీడర్ షిప్ ఛాలెంజ్ అకాడమీలో బెంగళూరు నుండి ఏడుగురు విద్యార్ధులు సెలెక్ట్ అయ్యారు. పుణె నుండి ఎనిమిది మందిమంది, ఢిల్లీ, హైదరాబాద్ నుండి ఒక్కొక్కర్ని సెలక్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్ అబ్బాయి రోహిత్ ఒకడు కావటం విశేషం.