ఒక్క రోజులో రూ. 2 కోట్ల ఆదాయం…పాత చలానాలు చెల్లించిన హైదరాబాదీలు

  • Published By: chvmurthy ,Published On : September 2, 2019 / 04:58 AM IST
ఒక్క రోజులో రూ. 2 కోట్ల ఆదాయం…పాత చలానాలు చెల్లించిన హైదరాబాదీలు

Updated On : September 2, 2019 / 4:58 AM IST

కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం  బకాయి పడ్డ పాత చలానాలు  రెట్టింపవుతాయనే  వదంతులతో  హైదరాబాద్ పోలీసు శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. హైదరాబాద్,సైబరాబాద్ పోలీసు స్టేషన్ల పరిధిలోని వాహన చోదకులు తమ పాత ట్రాఫిక్ చలానాలను శనివారం ఒక్కరోజే రూ.2.07 కోట్ల రూపాయలు చెల్లించారు.  10 వరకు  పెండింగ్ ఉన్న వాహనదారులు వివిధ రూపాల్లో  జరిమానా చెల్లించారు. 

రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు చేసింది. 2019, సెప్టెంబర్ 1 నుంచి సరికొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాల మొత్తాన్ని భారీగా పెంచేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆ రేంజ్ లో ఫైన్లు పెంచారు. కొత్త చట్టం ఎఫెక్ట్ బాగానే కనిపించింది. సోషల్ మీడియా పుణ్యమా అని హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించారు. 

శనివారం ఆగస్టు 31వ తేదీన వచ్చిన 2 కోట్ల రూపాయలను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.  జరిమానాలు కట్టిన వాహానాల్లో విశ్లేషించగా ఎక్కువభాగం ద్విచక్ర వాహనదారుల నుంచి వచ్చినట్లు తెలిసింది.  సెప్టెంబరు 1న రోడ్లపై ద్విచక్రవాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తూ కనిపించారు. హెల్మెట్ లు ధరించి, సీటు బెల్టు ధరించి వాహానాలు నడిపారు. పాత చలానాలకు కొత్త జరిమానా అమలవుతాయని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తప్పని  పోలీసులు ప్రచారం చేసినా  వేల సంఖ్యలో జరిమానాలు చెల్లించి….ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.