హైదరాబాద్‌కు కొత్త హంగులు.. హుస్సేన్ సాగర్ చుట్టూ మోనో రైలు

హైదరాబాద్‌కు కొత్త హంగులు.. హుస్సేన్ సాగర్ చుట్టూ మోనో రైలు

Updated On : October 8, 2020 / 10:24 AM IST

గ్రేటర్ Hyderabad వైభవాన్ని మరింత పెంచేలా హుస్సేన్ సాగర్ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. సాగర్ చుట్టూ.. మోనోరైల్‌ లైన్‌‍‌ను ఏర్పాటు చేయాలని దాని గురించి డిటైల్డ్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని టూరిజం మినిష్టర్ శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ అధికారులతో చర్చించాలని ఆదేశించారు.




నూతన టూరిజం ప్రాజెక్టులపై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ప్రతిపాదిత స్థలాల్లో టూరిజం ప్రాజెక్టుల డిజైన్‌లను ఎక్స్‌పీరియన్స్‌డ్ కన్సల్టెంట్‌ల ద్వారా రూపొందించి గవర్నమెంట్‌కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై ప్రముఖులు రూపొందించిన ప్రాజెక్టుల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లను మంత్రి పరిశీలించారు.

దుర్గం చెరువుతోపాటు కాళేశ్వరం, మిడ్‌ మానేరు, కొండపోచమ్మ, సోమశిలలో కొత్తగా చేపట్టనున్న టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ప్రముఖ సంస్థల అధికారులతో చర్చించారు. సమీక్షలో టూరిజం డిపార్ట్‌మెంట్ సెక్రటరీ కేఎస్‌ శ్రీనివాసరాజు, స్టేట్ ఐటీ శాఖ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, అడిషనల్ కలెక్టర్‌ హరీశ్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, టూరిజం డిపార్ట్‌మెంట్ ఎండీ మనోహర్‌ పాల్గొన్నారు.