పెరిగిన TS RTC బస్ పాసులు..చార్జీలు ఇలా

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ముగిసి పనిలో చేరారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ బస్ చార్జీలు పెంచక తప్పదని ప్రజలకు విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. కిలో మీటరుకు 20 పైసలు పెంచుతామని తెలిపారు. బస్ చార్జీలు పెరిగితే మరి బస్ పాస్ లు కూడా పెరుగుతాయి కదా. పెరిగిన బస్ పాస్ లు ఇలా ఉన్నాయి.
పెరిగిన బస్ పాస్ లు ఇలా
స్టూడెంట్ పాస్ రూ.390 నుంచి రూ.495
సిటీ ఆర్డినరీ చార్జీ రూ.770 నుంచి రూ.950
మెట్రో బస్ పాస్ రూ.880 నుంచి రూ.1070
మెట్రో డీలక్స్ చార్జ్ రూ.990 నుంచి రూ.1180
పెరిగిన ఆర్టీసీ బస్ చార్జీలు ఈ రోజు (డిసెంబర్ 2) అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. ఛార్జీల పెంపునకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ అన్ని బస్సు సర్వీసుల్లో కిలోమీటరుకు రూ. 20 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 5 నుంచి రూ. 10కి పెంపు, సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15కి పెంపు, డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20కి పెంపు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 25గా నిర్ణయించారు. రాజధాని, వజ్ర, గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 35కు పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 75గా నిర్ణయించారు. ఈ పెరిగిన ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.