హైదరాబాద్ లో సెక్స్ డ్రగ్ కలకలం : గుర్రాలకు వాడేది.. విద్యార్థులపై ప్రయోగాలు
బెంగళూరులోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నైలో ఈ డ్రగ్స్ మాఫియా విస్తరించినట్లు తెలిసింది. పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో.. హైదరాబాద్‌లోని నాచారంలోని ల్యాబ్ పై దాడి

బెంగళూరులోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నైలో ఈ డ్రగ్స్ మాఫియా విస్తరించినట్లు తెలిసింది. పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో.. హైదరాబాద్‌లోని నాచారంలోని ల్యాబ్ పై దాడి
హైదరాబాద్ లో సెక్స్ డ్రగ్ సంచలనంగా మారింది. కెటమైన్ మాదక ద్రవ్యాన్ని సెక్స్ డ్రగ్ గా పిలుస్తున్నారు. దీన్ని డేట్ రేప్ డ్రగ్ గా కూడా పిలుస్తారు. వాస్తవంగా అయితే కేటమైన్ డ్రగ్ ను గుర్రాల్లో వాడతారు. ఇప్పుడు మనుషులూ వాడుతుండటం షాక్ కు గురి చేస్తోంది. మనుషుల్లో సెక్స్ సామర్థ్యం, కోరికలు పెంచటం కోసం వాడుతున్నారు. కెటమైన్ నిషేధిత డ్రగ్. ప్రభుత్వాలు ఈ డ్రగ్ తయారీ, కొనుగోలును నిషేధించాయి. అయినా.. గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ డ్రగ్ అమ్ముతున్నారు.
ఇళ్ల మధ్య తయారీ ఎంతో డేంజర్ :
సైకోటోపిక్ సబ్‌స్టాన్సెస్ కేటగిరీలోకి వచ్చే కెటమైన్ ను కొన్ని రసాయనాలను వినియోగించి తయారు చేస్తారు. మూసి ఉన్న గదిలో యంత్రాన్ని ఉంచి, రసాయనాలను ప్రాసెసింగ్ చేస్తారు. కెటమైన్ తయారు చేయడం రిస్క్‌తో కూడుకున్న విషయం. ఈ డ్రగ్ తయారీలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ పేలుడు జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం ఉంటుంది. ఇళ్ల మధ్య, సిటీ నడిబొడ్డున ఇలా ఓ ల్యాబ్ లో కెటమైన డ్రగ్ తయారు చేయటాన్ని గుర్తించటం దేశంలోనే ఫస్ట్ టైం అంటున్నారు అధికారులు. సాధారణంగా కెటమైన్ తయారీ యంత్రాలను ఎవరూ ఇళ్లల్లో పెట్టుకోరు.
హైదరాబాద్ నాచారం ఫ్యాక్టరీలో తయారీ :
హైదరాబాద్ సిటీ నాచారంలోని ఓ ల్యాబ్ లో ఐదేళ్లుగా ఈ కెటమైన్ డ్రగ్ తయారు చేస్తున్నారు. తీగ బెంగళూరులో కదిలితే డొంక హైదరాబాద్‌లో బయటపడింది. బెంగళూరులోని కంగేరి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్‌ను కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నైలో ఈ డ్రగ్స్ మాఫియా విస్తరించినట్లు తెలిసింది. పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో.. హైదరాబాద్‌లోని నాచారంలోని ల్యాబ్ పై దాడి చేశారు పోలీసులు. సీజ్ చేశారు. మూతబడిన ల్యాబుల్లోనూ నిషేధిత డ్రగ్స్ తయారు అవుతున్నట్లు సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు.
విద్యార్థులపై ప్రయోగాలు :
కెటమైన్ డ్రగ్స్ వాడిన వారు పైశాచిక ఆనందంతో మృగాళ్లా ప్రవర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ వాడిన వారు వింతగా ప్రవర్తిస్తారు. సెక్స్ కోరికలు అధికంగా ఉంటాయి. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తులు 5 గంటలు అపస్మారక స్థితిలో ఉంటారు. ఆ సమయంలో ఏమైనా చేయొచ్చు. మహిళలకు ఇచ్చిన తర్వాత వారిపై అత్యాచారాలు చేయొచ్చు. వారికీ ఏమీ తెలియదు. అదే విధంగా మనిషిలో సెక్స్ హార్మోన్లు పెరిగి మృగంలా మారతారు.
బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా మాఫియా :
బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా కెటమైన్ మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తున్నారు. నాచారం పారిశ్రామికవాడలో ఇంతం కెమికల్ ల్యాబ్ పేరుతో ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఐదేళ్లుగా గుట్టుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సెక్స్ డ్రగ్ గా ఈ ‘కెటమైన్’ బెంగుళూరు, గోవా, హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
రేవ్ పార్టీలు, పబ్స్ టార్గెట్ :
మహా నగరాల్లోని యువతే వీరి టార్గెట్. సెక్స్ డ్రగ్ అలవాటు చేస్తున్నారు. ఒక్కసారి ఈ డ్రగ్స్ కు అలవాటు పడిన వారు పదే పదే కావాలని తహతహలాడతారు. దీంతో భారీ ఎత్తున కెటమిన్ అక్రమ వ్యాపారం జరుగుతోంది.
రేవ్ పార్టీలు, పబ్ లు, క్లబ్ లకు చేరవేస్తున్నట్లు సమాచారం. బెంగళూరులోనే కాకుండా హైదరాబాద్, ఏపీలోని కొన్ని నగరాలు, చెన్నైలో సెక్స్ డ్రగ్ రాకెట్ కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలుస్తోంది. ఇంతలా ఈ డ్రగ్స్ తయారీ కావడం వెనక డ్రగ్స్ మాఫియా హస్తం ఉందని చెబుతున్నారు పోలీసులు. మొత్తం వ్యవహారాన్ని కూపీ లాగే పనిలో ఉన్నారు.