మహిళలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 03:21 PM IST
మహిళలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు

Updated On : March 7, 2019 / 3:21 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు స్వయం సమృద్ధి సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల స్వయం సాధికారత దిశగా సమాజం పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

మహిళా సాధికారితకు అర్థాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వం తమదని సీఎం చంద్రబాబు చెప్పారు. పసుపు – కుంకుమ రెండో విడత సొమ్ము బ్యాంకుల్లో జామ చేస్తామని, ఇంటికో పారిశ్రామిక వేత్త ఉండేలా చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు బాబు.