ఆంధ్రలో జనవరి 25న మిలియన్ మార్చ్

జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆంధ్రప్రదేశ్ లో జనవరి 25న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ముస్తక్ మాలిక్ మాట్లాడుతూ.. ‘NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ప్రశాంతంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి 4న హైదరాబాద్‌లో జరిగినట్లుగా మార్చ్ జరుగుతుంది’
‘NRCను తప్పుడు ప్రయోజనం కోసం వాడుతుండటంపై జేఏసీ ప్రతి గుమ్మానికి వెళ్లి చెప్పాలనుకుంటున్నాం. హైదరాబాద్ లో జరిగిన మిలియన్ మార్చ్ లో పాల్గొని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలని మాలిక్ అన్నారు.
చారిత్రకంగా, ప్రశాంతంగా హైదరాబాద్ లో ర్యాలీ ముగిసింది. ఈ ఆందోళన ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకునేవరకూ కొనసాగుతుందని ఆయన అన్నారు. దేశంలో సెక్యూలర్ క్యారెక్టర్లు పెరిగిపోతున్నాయి. మిలియన్ మార్చ్ లో పాల్గొన్న వారిపై ఉన్న కేసులను రాష్ట్ర హోం శాఖ విత్ డ్రా చేయాలని ఈసందర్భంగా జేఏసీ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నగరంలో ప్రశాంతమైన ర్యాలీ నిర్వహించినప్పటికీ పోలీసులు 25కేసులు బుక్ చేశారనే సంగతి గుర్తు చేశారు. టీఆర్ఎస్ దీనిని పట్టించుకోవాలని కేసులను ఉపసంహరించాలని ఆయన కోరారు.