పెన్సిల్ పై కేసీఆర్ చరిత్ర : తెలంగాణ యువకుడి ప్రతిభ

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 07:38 AM IST
పెన్సిల్ పై కేసీఆర్ చరిత్ర : తెలంగాణ యువకుడి ప్రతిభ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషికి ఓ యువకుడు వినూత్నంగా అభినందనలు తెలిపాడు. ఉస్మానియా యూనివర్శిటీలో మాస్టర్స్ చేస్తున్న దుర్గం వినయ్ కుమార్ కు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన పై తనకున్న ఇష్టాన్ని..గౌరవాన్ని సృజనాత్మకంగా తెలియజేశాడు. మైక్రో ఆర్టిస్ట్ అయిన వినయ్ కేసీఆర్ 65వ పుట్టిన రోజు సందర్భంగా తనదైన శైలిలో ఆయన రాజకీయ చరిత్రను  2 మి.మీటర్ల పెన్సిల్ రీఫిల్ పై చెక్కి అభినందనలు తెలిపాడు.
 

2014 లో జాతీయ గీతాన్ని నువ్వులపై రాశాడు వినయ్ కుమార్. ఈ క్రమంలో రాష్ట్రాలకు సంబంధించిన అనేక విషయాలను మైక్రో ఆర్ట్ ద్వారా ప్రత్యేకంగా ఏదో చేయాలని భావించాడు. విభిన్న సామాజిక-రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలను మైక్రో ఆర్ట్ తో చేసేవాడు. కుమారం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసి అయిన వినయ్  కుమార్. ఈ క్రమంలో అంబేద్కర్ 125 వ జయంతి వార్షికోత్సవాన్ని జ్ఞాపకార్థంగా 6,500 అగ్గిపుల్లలపై బాబా సాహెబ్  అంబేద్కర్ బొమ్మలు వేసి అందర్ని ఆకట్టుకున్నాడు. 

పెన్సిల్ లీడ్ పై కేసీఆర్ రాజకీయ జీవితచరిత్ర..2014 లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో..20,728 తంగేడు ఆకులపై తెలంగాణ చరిత్రను రాశాడు వినయ్. “తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పం కాబట్టి రాష్ట్ర చరిత్రను మూడు నెలల పాటు కష్టపడి  తంగేడు ఆకులపై రాసానని’’ తెలిపాడు. తంగేడు ఆకులపై తెలంగాణ చరిత్రకు సంబంధించి వినయ్ కు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించాడు. అనంతరం 2015 లో..టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను నవధాన్యాలపై చెక్కాడు.  జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  తాను గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై తాను చేసిన అన్ని మైక్రో ఆర్ట్ లను కేసీఆర్ సమక్షంలో ఆవిష్కరించాలనుకుంటున్నానని వినయ్ తెలిపాడు.