మహిళలపై నేరాలు తెలంగాణలో తక్కువ : సీఎం కేసీఆర్ పై విమర్శలు కరెక్ట్ కాదు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ

  • Published By: veegamteam ,Published On : December 2, 2019 / 02:29 PM IST
మహిళలపై నేరాలు తెలంగాణలో తక్కువ : సీఎం కేసీఆర్ పై విమర్శలు కరెక్ట్ కాదు

Updated On : December 2, 2019 / 2:29 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ ఘటనలో ప్రభుత్వం సరిగా స్పందించలేదనే విమర్శలను కేకే ఖండించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దిశ ఘటనకు కారణం అన్న ఆరోపణలను కొట్టిపారేశారు. దిశ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం వెంటనే స్పందించిందని కేకే చెప్పారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వారిని విధుల నుంచి తొలగించిందన్నారు.

దిశ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. సానుభూతి చూపడం కాదు..న్యాయం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తాము ప్రకటనలను నమ్మము అన్న కేకే.. పనిని మాత్రమే నమ్ముతామన్నారు. మహిళలపై నేరాల్లో దేశంలోనే తెలంగాణలో తక్కువ అని కేకే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పూర్తి భద్రత ఉందన్నారు. మహిళల రక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.