ఒకే కార్డ్ తో : ఆల్ జర్నీస్ అండ్ షాపింగ్

హైదరాబాద్: టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ప్రయాణం కూడా స్మార్ట్ గా అయిపోతోంది. ఈ క్రమంలో నగర ప్రజలకు మరో ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. నగరంలో ఉండే అన్ని ట్రాన్స్ పోర్ట్ లలోను ఒకే కార్డుతో ప్రయాణంచేసే ఫెసిలిటీని అందుబాటులోకి రానుంది. అదే ‘మెట్రో మెబిలిటీ కార్డ్’. ఈ కార్డ్ అందుబాటులోకి వస్తే నగరవాసులకు ప్రయాణం మరింత ఈజీ కానుంది. అన్ని రవాణా సంస్థల్లోను ఈ కార్డులో ప్రయాణించవచ్చు. అంటే ఎంఎంటీఎస్, మెట్రో రైలు, ఆర్టీసీ , క్యాబ్‌లు, ఆటోల్లో ఈ కార్డుపై ప్రయాణించవచ్చు.
అంతేకాదు ఈ కామన్ మొబిలిటీ కార్డు ట్రావెలింగ్‌తోపాటు షాపింగ్‌కు కూడా ఉపయోగపడేట్లు రూపొందిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రోతోపాటు ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోల్లో ఉపయోగించే ఈ కార్డు షాపింగ్‌తో పాటు పార్కింగ్, టోల్‌ట్యాక్స్ చెల్లింపులకు కూడా ఉపయోగపడేట్లు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం రూపొందిస్తోంది.
దీనికి సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఐటీశాఖకు ఆయా రవాణా సంస్థలు అందచేశాయి. ఈ ప్రపోజల్స్‌ను పరిశీలించిన అనంతరం ఏజెన్సీ కోసం టెండర్లు పిలిచి కార్డు తయారీ పనులు అప్పగించేందు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో దీనిలో క్యూఆర్ కోడ్, స్వైపింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
అంతేకాదు వీటితో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెషిఫికేషన్లను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. కేంద్రం సిఫారసు చేసిన ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును పరిశీలిస్తున్నారు. లండన్ మెట్రోలో అమలవుతున్న కామన్ మొబిలిటీ కార్డు టెక్నాలజీనీ పరిశీలిస్తున్నారు. మార్చి 27న ఆర్టీసీ, మెట్రోతోపాటు క్యాబ్ ఆపరేటర్లు, ఆటో యూనియన్ల ప్రతినిధులతో సీఎస్ సమీక్ష జరుపి ఈ ప్రపోజల్స్ అందించినట్లుగా తెలుస్తోంది.
ఒక్కో కార్డులో మినిమమ్ వెయ్యి రూపాయలు చేసుకునేలా ఉండనుంది. ఈ కార్డుకు అన్ని రకాల వినియోగాలాతో సేఫ్టీ ఫీచర్స్ ని కూడా పక్కాగా ఉండేలా క్యూఆర్ కోడ్‌ను పొందుపరిచి ఉంటుంది. హైదరాబాద్‌లో పరిచయం చేసే మెట్రోకార్డు బాధ్యతలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు అందించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే అహ్మదాబాద్, ఢిల్లీలో కామన్‌కార్డు వినియోగం ఇప్పటికే అమలు జరుగుతోంది. హైదరాబాద్ లో కూడా ఈ కామన్ కార్డు విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు.