Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఖతర్నాక్ డీల్స్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Flipkart Big Billion Days Sale : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఖతర్నాక్ డీల్స్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Flipkart Big Billion Days Sale

Updated On : September 12, 2025 / 2:54 PM IST

Flipkart Big Billion Days Sale : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందించనుంది. అయితే, సేల్ ప్రారంభానికి ముందే ఫ్లిప్‌కార్ట్ ప్రీ-డీల్స్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S23 అల్ట్రా వంటి హై-ఎండ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. శాంసంగ్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లపై ఓసారి లుక్కేయండి.

గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S23 అల్ట్రా ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days Sale) కన్నా ముందే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S23 అల్ట్రా ధరలు తగ్గాయి. 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్‌ అసలు ధర రూ.1,29,999 నుంచి రూ.81,985కి ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

అదేవిధంగా, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 12GB ర్యామ్ వేరియంట్‌ అసలు ధర రూ.1,24,999 నుంచి రూ.76,990 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు Flipkart Axis Bank లేదా Flipkart SBI క్రెడిట్ కార్డ్‌తో రూ.4వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. ఇక పండగ చేస్కోండి..!

గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S23 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. అడ్రినో 750 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

ఈ శాంసంగ్ ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S24 అల్ట్రా లాంటి డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అడ్రినో 740 జీపీయూతో 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ కలిగి ఉంది. ఈ ఫోన్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది.