లాల్ దర్వాజ దేవాలయాన్ని అభివృద్ధి చేయండి : సీఎం కేసీఆర్ ను కోరిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్

హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. సీఎం కేసీఆర్ ను కోరారు.

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 01:20 PM IST
లాల్ దర్వాజ దేవాలయాన్ని అభివృద్ధి చేయండి : సీఎం కేసీఆర్ ను కోరిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్

Updated On : February 9, 2020 / 1:20 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. సీఎం కేసీఆర్ ను కోరారు.

హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. సీఎం కేసీఆర్ ను కోరారు. ఆలయంలో తక్కువ స్థలం ఉండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 9, 2020) ప్రగతి భవన్ లో ఆయనను కలిసి విజ్ఞాపన పత్రం అందచేశారు. దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ ఆలయంలో తగినంత స్థలం లేకపోవడం, దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

లాల్ దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారని తెలిపారు. కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉందని, ఇంత తక్కువ స్థలం ఉండటంతో లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో ఇబ్బంది కల్గుతుందన్నారు. దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.

రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలన్నారు. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉందని. వారికి ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసి ఆధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయడాన్ని అత్యంత ముఖ్యమైన పనిగా భావించాలని.. ఇది భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని సీఎం కేసీఆర్‌కు తెలిపారు.

అలాగే పాతబస్తీలో అఫ్జల్ గంజ్ మసీద్ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని అక్బరుద్దీన్.. సీఎం కేసీఆర్ ను కోరారు. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని, మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతున్నదని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా పాతబస్తీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరారు. అక్బరుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.