పౌరసత్వం రద్దుపై హైకోర్టులో పిటిషన్ వేసిన చెన్నమనేని

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు.

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 10:54 AM IST
పౌరసత్వం రద్దుపై హైకోర్టులో పిటిషన్ వేసిన చెన్నమనేని

Updated On : November 21, 2019 / 10:54 AM IST

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు.

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు. చెన్నమనేని వేసిన పిటిషన్ పై శుక్రవారం(నవంబర్ 22, 2019) హైకోర్టు విచారణ చేపట్టనుంది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ నిన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను వెంటనే కొట్టివేయాలని చెప్పి మరోసారి చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. 
  
చెన్నమనేని రమేష్ ప్రత్యర్థి అయిన ఆది శ్రీనివాస్ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని, మోసపూరిత పత్రాలతో భారతదేశం పౌరసత్వం పొందాడని గత పది సంవత్సరాలుగా చెబుతునే ఉన్నానని చెప్పారు. తాను పిటిషన్ లో వినిపిస్తున్న వాదన నిజమైందన్నారు. తమ వాదనలను హైకోర్టులో వినిపించాలనే లక్ష్యంతో కేవియట్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. వాదనలు జరిగే సమయంలో తమ వాదనలను కూడా బలంగా వినిపిస్తామని చెప్పారు. చెన్నమనేని భారత దేశ చట్టాలను ఉల్లంఘించిన వైనాన్ని చెబుతామని చెప్పారు. అతను మెసపూరిత పత్రాలతో ఏ విధంగా భారత పౌరసత్వాన్ని పొందాడన్న విషయాన్ని తెలుపుతామన్నారు. 

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని హోంశాఖ తెలిపింది. హోంశాఖ ఆదేశాలతో చెన్నమనేని ఎమ్మెల్యే పదవిని కోల్పేయే అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్యే పదవి ఉంటుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. కేంద్ర హోంశాఖ తీర్పుపై చెన్నమనేని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని చెన్నమనేని రమేష్ చెప్పారు.

2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు చెన్నమనేని రమేశ్‌. అప్పటినుంచీ ఆయన పౌరసత్వంపై వివాదం రగులుతూనే ఉంది. జర్మనీ దేశస్తురాలిని వివాహం చేసుకోవడంతో పాటు… ఆ దేశ పౌరసత్వాన్ని పొందారన్నది రమేష్ బాబుపై ఉన్న ఆరోపణ. ఎన్నికల్లో పోటీ చేసే ముందు భారతదేశ పౌరసత్వాన్ని తిరిగిపొందడానికి… నిబంధనలు పాటించకుండా తప్పుడు ధృవపత్రాలను సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. 2009లోనే ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

2010లో అప్పటి ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హై కోర్టు 2013 ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు రమేష్ బాబు. అలాగే పౌరసత్వ వివాదం కేంద్ర హోంశాఖే తేల్చాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు.