తెలంగాణ అసెంబ్లీ : భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సునీత

  • Published By: madhu ,Published On : September 20, 2019 / 06:03 AM IST
తెలంగాణ అసెంబ్లీ : భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సునీత

Updated On : September 20, 2019 / 6:03 AM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సునీత భావోద్వేగానికి గురయ్యారు. కిడ్నీ రోగుల అంశంపై మాట్లాడుతూ..కన్నీళ్లు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. కిడ్నీ రోగుల అంశంపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. డయాలసిస్ పేషెంట్ల సమస్యలను సభలో ప్రస్తావించారు. దీనిపై ఎమ్మెల్యే సునీత మాట్లాడారు.

ఈ సమస్యలతో బాద పడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయారని సభలో తెలిపారు. ఈ సందర్భంగా నాన్నను గుర్తుకు తెచ్చుకున్నారు. నాన్న కూడా..14 ఏళ్లుగా డయాలిసిస్ పేషెంట్‌గా ఉన్నారు..దీంతో తాము ఆర్థికంగా చితికిపోయాం…తాము ఎంతో బాధ పడ్డామని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలి కాబట్టి..ఆసరా పెన్షన్లు, ఎయిడ్స్ పేషెంట్స్ ఇచ్చినట్లుగానే కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని కోరారు. 
Read More : కేసీఆర్ – జగన్‌ల భేటీ 24న!