వెదర్ అప్ డేట్ : తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఉండదు

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 04:25 AM IST
వెదర్ అప్ డేట్ : తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఉండదు

Updated On : May 28, 2020 / 3:41 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 03వ తేదీ గురువారం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఫొని తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండదన్నారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి మే 01వ తేదీ బుధవారం ఉదయం 8గంటల వరకు అత్యధికంగా నాగర్ కర్నూలు, తిమ్మాజీపేట, కొడంగల్ ప్రాంతాల్లో రెండు సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసిందన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి గాలి..వాన బీభత్సం సృష్టించాయి. 
Also Read : ఒడిశాలో ఫోనీ ఎఫెక్ట్ : నదులకు వరద ముప్పు

మరోవైపు మే 01వ తేద బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో 46 డిగ్రీలు, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలు నమోదైంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్ర బేగంపేట, సికింద్రాబాద్, అమీర్ పేట, బంజారాహిల్స్, రాజేంద్రనగర్ తదిర ప్రాంతాల్లో వర్షం పడింది. 
Also Read : ఫోని తుఫాన్ ప్రభావం : 50కి పైగా రైళ్లు రద్దు