ప్రత్యేక ప్రధాని కావాలన్న వ్యక్తితో కలిసి ప్రచారం చేస్తారా : బాబుపై మోడీ ఆగ్రహం

హైదరాబాద్ : దేశ భక్తులు ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరో మీరే గమనించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహాకూటమి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుపై మోడీ నిప్పులు

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 03:13 PM IST
ప్రత్యేక ప్రధాని కావాలన్న వ్యక్తితో కలిసి ప్రచారం చేస్తారా : బాబుపై మోడీ ఆగ్రహం

Updated On : April 1, 2019 / 3:13 PM IST

హైదరాబాద్ : దేశ భక్తులు ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరో మీరే గమనించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహాకూటమి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుపై మోడీ నిప్పులు

హైదరాబాద్ : దేశ భక్తులు ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరో మీరే గమనించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహాకూటమి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుపై మోడీ నిప్పులు చెరిగారు. దేశానికి ఇద్దరు ప్రధానులు ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ కోరుతోందని ప్రధాని మోడీ విమర్శించారు. కశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలన్న ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు ప్రచారం చేయడం ఏంటని మోడీ మండిపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోడీ మాట్లాడారు. మహాకూటమి టార్గెట్ గా ఫైర్ అయ్యారు.

‘జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలి’ అని ఫరూక్ అబ్దుల్లా అన్నారని, దానికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు ‘మహాకూటమి’ మద్దతు ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఎవరు దేశభక్తులో ఎవరు పాకిస్థాన్ ఏజెంట్లో ప్రజలు గమనించాలని కోరారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలంటున్న ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ఏపీలోని యు-టర్న్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారని మోడీ విమర్శించారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ప్రధాని నిప్పులు చెరిగారు. మోడీ ఉన్నంత కాలం ఇలాంటి విభజన వాదుల ఆటలు సాగవన్నారు. దేశ శత్రువులకు, ప్రజలకు మధ్య బలమైన గోడగా తాను నిలబడతా అని చెప్పారు. నేనున్నంత వరకూ దేశాన్ని విడగొట్టాలన్న కలలు నిజం కానివ్వను అని వెల్లడించారు. జమ్ముకశ్మీర్ లో ఎవరి ఆటలూ సాగనివ్వను అని, దేశం కోసం దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని ప్రజలకు మోడీ సూచించారు.