రాకపోకలు షురూ : LB Nagar Flyover ప్రారంభం

  • Published By: madhu ,Published On : March 1, 2019 / 07:58 AM IST
రాకపోకలు షురూ : LB Nagar Flyover ప్రారంభం

Updated On : March 1, 2019 / 7:58 AM IST

ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ అయ్యాయి. ఏడాది సమయంలోనే పూర్తయిన ఈ ఫ్లై ఓవర్‌ని మార్చి 01వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానం కిషోర్‌లు పాల్గొన్నారు. సంవత్సరకాలంలోనే పూర్తయినా ప్రారంభోత్సవం కోసం నెల సమయం పట్టింది. 
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

హయత్ నగర్, చౌటుప్పల్, విజయవాడకు వెళ్లే ప్రయాణీకుల కష్టాలు దీనితో తీరనున్నాయి. కుడివైపు ఫ్లై ఓవర్, రింగ్ రోడ్ వద్ద అండర్ పాస్‌లు నిర్మాణమవుతున్నాయి. ఇవి పూర్తయితే ఎల్‌బీనగర్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య తీరనుంది. అంతేగాకుండా ప్రయాణ సమయం, వాహన నిర్వాహణ, ఇంధన వ్యయం తగ్గనుంది. 
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే

ప్రభుత్వం దాదాపు రూ. 25వేల కోట్లతో ఎస్సార్‌డీపీ పనులు చేపట్టింది. ప్యాకేజీ -2లో భాగంగా ఎల్‌బీనగర్ పరిసరాల్లోని 4 జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల అంచనా వ్యయం మొత్తం రూ. 448 కోట్లు. ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్‌ను రూ. 42 కోట్లతో వ్యయంతో నిర్మించారు. 

ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ విశేషాలు : 
వ్యయం – రూ. 42 కోట్లు. 
పొడవు – 780 మీ
వెడల్పు – 12మీ
ర్యాంపుల పొడవు –  400 మీ. 
క్యారేజ్ వే – 11 మీ
ఫ్లై ఓవర్ ఎత్తు – 5.5మీ
వాహనాలు వెళ్లేందుకు – 11మీ
టెక్నాలజీ – ప్రీకాస్ట్