ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు

  • Published By: vamsi ,Published On : February 22, 2019 / 07:28 AM IST
ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు

Updated On : February 22, 2019 / 7:28 AM IST

ఆరోగ్యమే తెలంగాణ ప్రగతికి మూలం అనే నినాదంతో సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ENT, దంత పరీక్షలు చేసేందుకు కొత్తగా నిధులను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ లో రూ.5వేల 536 కోట్లను సీఎం కేసిఆర్ కేటాయించారు. ఇదివరకే కంటికి సంబంధించి కంటివెలుగు స్కీమును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటికే కంటి వెలుగుతో గ్రామగ్రామాన ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు చేస్తున్నారు. కళ్లద్దాలు కూడా ఉచితంగా అందిస్తున్నారు.

ఇప్పుడు చెవి, ముక్కు, గొంతు పరీక్షలను కూడా ఇదే తరహాలో నిర్వహించనున్నారు. పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందిస్తారు. అవసరం అయిన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించనున్నారు. చెవి, ముక్కు, గొంతు పరీక్షలతో పాటు దంత పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ ప్రకటించారు. 

ఇది కొత్తగా తీసుకొచ్చిన పథకం. కంటి వెలుగు తరహాలోనే.. చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు క్యాంప్ లు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మనిషీ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది. వైద్యం అనేది కనీస హక్కుగా భావించి తీసుకొస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

Read Also: నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు
Read Also: తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు
Read Also: తెలంగాణ బడ్జెట్ : ఆసరా పెన్షన్స్ రూ.12 వేల 67 కోట్లు