మద్యం మత్తులో కారు నడిపిన మిత్తి మోడీ, ప్రియాంక మృతి.. గచ్చిబౌలి కారు ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 05:45 PM IST
మద్యం మత్తులో కారు నడిపిన మిత్తి మోడీ, ప్రియాంక మృతి.. గచ్చిబౌలి కారు ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్

Updated On : November 9, 2020 / 6:17 PM IST

gachibowli car accident: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర కారు ప్రమాదం జరిగింది. భయాందోళనలు కలిగించిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి కారు ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో విద్యార్థిని ప్రియాంక స్పాట్ లోనే చనిపోయింది. మరో విద్యార్థి మిత్తి మోడీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మిత్తి మోడీ మద్యం మత్తులో కారు నడిపటం వల్లే ప్రమాదం జరిగినట్టు గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు.




లాంగ్ డ్రైవ్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. హెచ్ సీయూ గేట్ 2 సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టుని ఢీకొట్టింది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రియాంక స్పాట్ లోనే చనిపోయింది. మద్యం మత్తులో వాహనం నడిపితే పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ప్రమాదం ఓ నిదర్శనం అని పోలీసులు అంటున్నారు. మృతురాలు ప్రియాంక మధురానగర్ వాసి. కారు నడిపిన మిత్తి మోడీ రష్యాకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. యాక్సిడెంట్ లో కారు నుజ్జునుజ్జు అయ్యింది.
https://10tv.in/the-father-who-tried-to-kill-his-children/