తెలంగాణలో కనిపించని సమ్మె ప్రభావం

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు తమ హక్కుల సాధన కోసం కార్మిక సంఘాలు రెండు రోజులపాటు సమ్మె చేపట్టాయి. నేడు, రేపు సమ్మెకు పిలుపు ఇచ్చాయి. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు.
దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మెకు మిశ్రమ స్పందన లభిస్తోంది. తెలంగాణలో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. హైదరాబాద్ లో ఆటోలు, ఆర్టీసీ బస్సులు యాధావిధిగా తిరుగుతున్నాయి. మహాత్మ గాంధీ బస్ స్టాండ్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే బస్సుల తిరుగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణిలో సమ్మె ప్రభావం కనిపించడం లేదు. యాధావిధిగా కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ సమ్మెకు మద్దతు తెలిపినప్పటికీ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలపనుంది. 12 డిమాండ్లతో కార్మిక లోకం సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో 10 ట్రేడ్ యూనియన్లు పాల్గొననున్నాయి. బీజేపీ అనుబంధ యూనియన్ మినహా మిగతా అన్ని యూనియన్లు సమ్మెకు మద్దుతు తెలిపాయి.