ఏపీలో ఫస్ట్ : ఒకే రాష్ట్రం.. ఒకే సిరీస్ నెంబర్

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2019 / 02:49 AM IST
ఏపీలో ఫస్ట్ : ఒకే రాష్ట్రం.. ఒకే సిరీస్ నెంబర్

Updated On : January 31, 2019 / 2:49 AM IST

ఆంధ్రప్రదేశ్ లో వాహన రిజిస్టరేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ఏపీ 39 సిరీస్ అమలుకానుంది. ఒకే రాష్ట్రం..ఒకే సిరీస్ విధానాన్ని రాష్ట్ర రవాణాశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. బుధవారం(జనవరి 30, 2019) విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఒకే రాష్ట్రం ఒకే సిరీస్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, ఏపీలో అది సాధ్యమైనందుకు గర్వపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

జిల్లాకు ఒక సిరీస్ లేకుండా రాష్ట్రమంతా ఒకే సిరీస్ ఉంటుందన్నారు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన కొత్త సిరీస్ లో ఏపీ 39 ఏ0002 నంబర్ విజయాడకు చెందిన కల్పనకు వచ్చింది. ఇకపై ఏ జిల్లా వక్తి అయినా ఏపీ39 తర్వాత ఎటువంటి ఫ్యాన్సీ నంబర్ కావాలన్నా ఆన్ లైన్ ద్వారా బిడ్ వేసుకోవచ్చు. నెలల తరబడి ఆగకుండా 0001 నుంచి 9999 నంబర్ వరకు ఏదైనా 3 రోజుల్లో అయిపోతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు.