ప్రాణం తీసిన ఇయర్ ఫోన్ : రైలు ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : February 2, 2020 / 02:13 AM IST
ప్రాణం తీసిన ఇయర్ ఫోన్ : రైలు ఢీకొని వ్యక్తి మృతి

Updated On : February 2, 2020 / 2:13 AM IST

హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం… గుర్తు తెలియని వ్యక్తి(30) శనివారం (ఫిబ్రవరి 1, 2020) కాచిగూడ-విద్యా నగర్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య తిలక్‌నగర్‌ బ్రిడ్జి సమీపంలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. 

ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకోవడం వల్ల రైలు వస్తున్న శబ్ధం వినపడకపోవడంతో అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో అతను అక్క డికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులు 99493266 25, 040-27568355లో సంప్రదించాలని పోలీసులు కోరారు.