పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు

ఎన్నికల వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 10:03 AM IST
పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు

Updated On : April 5, 2019 / 10:03 AM IST

ఎన్నికల వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది.

హైదరాబాద్ : ఎన్నికల వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై సీపీ అంజనీ కుమార్ వివారాలను వెల్లడించారు. ఇప్పటి వరకూ తాము రూ.3 కోట్ల 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా మొదటిసారి ఓ వాహనంలో తరలిస్తున్న రూ.కోటి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలువురి ఇళ్లలో నగదు భారీగా ఉందనే సమాచారంతో చేసిన తనిఖీలలో భారీ నగదును స్వాధీనం చేసుకున్నామని..హవాలా మనీ కూడా చేతులు మారుతోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ

ఎటువంటి అనుమతులు లేకుండా నగదు తరలిస్తున్న 8మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొత్తం 500ల మంది పోలీసులు పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టామని 43కేసులు నమోదు చేశామన్నారు. అలాగే ఎన్నికల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని, రౌడీ షీటర్స్ ను 1869 మందిపై కేసులు  నమోదు చేశామన్నారు. ఈ క్రమంలో రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకున్నామనీ.. ఈ క్రమంలో మీడియాకు సీపీ ధన్యవాదాలు తెలిపారు. పబ్లిక్ బాగా సహకరిస్తున్నారనీ..వారిచ్చిన సమచారం ఆధారంతోనే పలు వాహనాలలో తరలిస్తున్న బ్లాక్ మనీని పట్టుకోగలుతున్నామని తెలిపారు. 
Read Also : టీ.టీడీపీకి మరో షాక్ : TRSలోకి మండవ వెంకటేశ్వరరావు