శివాజీకి పరిజ్ఞానం లేదు: పోసాని
సినీ నటుడు శివాజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి. మీడియాలో ప్రచారం కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

సినీ నటుడు శివాజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి. మీడియాలో ప్రచారం కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
సినీ నటుడు శివాజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి. మీడియాలో ప్రచారం కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి శివాజీ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ మాత్రం పరిజ్ఞానం వ్యక్తి శివాజీ అంటూ విరుచకుపడ్డారు పోసాని కృష్ణ మురళి. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం శివాజీ..ప్రెస్ మీట్ పెట్టి..పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై పోసాని కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ 08వ తేదీ సోమవారం మీడియా సమావేశంలో పోసాని మాట్లాడారు.
Read Also : తోట త్రిమూర్తులకు పవన్ హెచ్చరిక : అన్నయ్య మాటే విన.. మీ మాట వింటానా ?
లక్ష్మీ పార్వతిపై కక్షతో కేసులు పెట్టించారని తెలిపిన పోసాని..జయప్రద, రోజా, కవితల సేవలను వినియోగించుకుని వారిని చంద్రబాబు బయటకు పంపించారన్నారు. జగన్ మంచి వాడు కాదని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే నేను పవన్ కళ్యాణ్‌ని సమర్థిస్తానని..అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించకుండా పవన్ కళ్యాణ్ జగన్‌ను విమర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కు అయ్యి జగన్‌పై కేసులు పెట్టించారని పోసాని వెల్లడించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మకండి, చంద్రబాబుకు కుల ప్రీతి ఎక్కువ, వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గెలిపించండని పిలుపునిచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తానని వెల్లడించారు.
Read Also : పులివెందులలో దళితులకు రక్షణ లేదు: వైసీపీ వాళ్ల ఇళ్ల ముందు చెప్పులు తీసి వెళ్లాలి