ట్రోలింగ్ :  పుల్వామా దాడికి అనసూయ డ్రెస్ లకు లింక్

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 07:35 AM IST
ట్రోలింగ్ :  పుల్వామా దాడికి అనసూయ డ్రెస్ లకు లింక్

Updated On : February 19, 2019 / 7:35 AM IST

హైదరాబాద్ : యాంకర్ అనుసూయ నెటిజన్స్ పై మండి పడుతోంది. పుల్వామా ఘటనకు..తన డ్రస్‌లకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ పై ఫైర్ అయింది అనసూయ. పుల్వామా ఘటనపై పాక్ పై యుద్ధం చేయాలని అందరూ అంటున్నారనీ.. అన్ని వేళలా యుద్ధం మంచిది కాదని అనుసూయ అన్న మాటలపై నెటిజన్స్ మండిపడ్డారు. పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకోవటం కాదు.. దేశంపై ప్రేమ కూడా ఉండాలని ట్రోలింగ్ పై అనుసూయ మండిపడింది. 
 

సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తు.. అసభ్యంగా కామెంట్స్ చేసేవాళ్లు..వట్టి మాటలతో ఆనంద పడుతుంటారనీ..రెచ్చగొట్టేలా కామెంట్స్ పెట్టి ఆనందపడుతుంటారనీ..అంత దేశ భక్తి ఉన్నవారు దేశ సరిహద్దులకు వెళ్లి శతృవులపై యుద్ధం చేసే దమ్మ ఈ వదరుబోతులకు ఉండదంటు మండిపడింది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి తర్వాత కొందరు అనసూయను టార్గెట్ చేసుకున్నారు. ఆమెను ట్రోల్ చేస్తూ.. వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన అనసూయ స్పందించింది. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా అభిమానులతో మాట్లాడుతూ ట్రోలర్స్, హేట్ స్పీచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 

‘‘యుద్ధం రావాల్సిందే అని కొందరు అంటున్నారు. ఆ కామెంట్స్ చేస్తున్నవారు అక్కడికి వెళ్లి యుద్ధం చేస్తున్నారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసా? పుల్వామా ఉగ్రవాది దాడి ఘటన చాలా ఘోరం. దానిపై నాకు చాలా బాధగా ఉంది. కానీ, మనమూ అలాగే చేద్దామనడం కరక్టేనా? అసలు యుద్ధం గురించి మీకు ఏం తెలుసు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించింది. 

Read Also : సిద్ధూపై రష్మీ చెడుగుడు : సాలే.. పాకిస్తాన్ పో

Read Also : సానియా సీరియస్ : నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరంలేదు