మీ తెలివికి హ్యాట్సాప్ : ప్లాట్ ఫాం టికెట్ ఎందుకు.. జర్నీ టికెట్లు కొనేద్దాం

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 12:03 PM IST
మీ తెలివికి హ్యాట్సాప్ : ప్లాట్ ఫాం టికెట్ ఎందుకు.. జర్నీ టికెట్లు కొనేద్దాం

Updated On : October 3, 2019 / 12:03 PM IST

దసరా పండుగ సరదాలతోపాటు కొత్త కొత్త ఐడియాలను కూడా క్రియేట్ చేస్తోంది. దసరా పండక్కి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజలు ప్రయాణం చేస్తారు. దీంతో రద్దీని కంట్రోల్ చేయటం కోసం రైల్వేశాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచింది. రూ.10 ఉన్న ప్లాట్ ఫాం టికెట్ ధరను 30 రూపాయలు చేశారు. దసరా పండుగ సీజన్ అంతా ఇవే ధరలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ చెప్పింది. పేరంట్స్, బంధువులను రైల్వేస్టేషన్ కు వచ్చే వారు రూ.30 పెట్టి ప్లాట్ ఫాం టికెట్ అంటే షాక్ అవుతున్నారు. అయినా సరే కంగారు పడకుండా కొత్త ఐడియా వేశారు ప్రయాణికులు.

30 రూపాయల ప్లాట్ ఫాం ధర కంటే తక్కువ దూరం జర్నీకి టికెట్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో షార్ట్ జర్నీ టికెట్ల విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ప్లాట్ ఫాం టికెట్ కౌంటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటు. బెజవాడ స్టేషన్ లో పాసింజర్ రైల్ టికెట్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయి. తక్కువ దూరానికి 10 రూపాయలే ఉంటుంది. 30 పెట్టి ప్లాట్ ఫాం టికెట్ కొనే కంటే.. 10 రూపాయలతో రైలు టికెట్ ఈజీ కదా అని విజిటర్స్ అందరూ అటువైపు డైవర్ట్ అయ్యారు.

ఒక్కసారిగా గుంటూరు, ఇతర పాసింజర్ రైల్ టికెట్ల అమ్మకాలు పెరటంపై ఆరా తీసిన అధికారులకు ఈ విషయం తెలిసింది. షాక్ అయ్యారు. రద్దీ తగ్గిద్దామని ప్లాట్ ఫాం టికెట్ రేట్లు పెంచితే.. కొత్త ఐడియాకి ఊపిరిపోశాం అని అంటున్నారు. భవిష్యత్ లో ప్లాట్ ఫాం టికెట్ 20 రూపాయలు అయినా.. కొనేవారు ఉంటారా అనే ఆందోళన మొదలైంది. కొన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. లోకల్ రైల్ టికెట్ కొనుగోలు చేస్తున్నారు. పేరంట్స్, బంధువులను రిసీవ్ చేసుకోవటానికి వచ్చేవారు సాధారణ రైలు టికెట్ కొనుగోలు చేసి ఎంట్రీ అవుతున్నారు. టికెట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్.