వెదర్ అప్‌డేట్ : తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 02:09 AM IST
వెదర్ అప్‌డేట్ : తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు

హైదరాబాద్ : ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మార్చి 9 శనివారం తెలంగాణలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీన పడింది. కోస్తాంధ్రలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమలో వేడి గాలులు కొనసాగుతున్నాయి.

మార్చి 8 శుక్రవారం భద్రాచలంలో అత్యధికంగా 37.2, నిజామాబాద్ లో 36.9, ఖమ్మం, నల్గొండలో 36.8, హైదరాబాద్ లో 34.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాత్రి పూట కొన్ని ప్రాంతాల్లో చలి ఉంటోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ లో 14, మెదక్ లో 17, హైదరాబాద్ లో 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.