ఖైదీ నెంబర్ 4412 : రాత్రి జైల్లో ఎవరితోనూ మాట్లాడని రవిప్రకాశ్
రూ.18 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ

రూ.18 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ
రూ.18 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ తేదీ వరకూ(14 రోజులు) జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో శనివారం(అక్టోబర్ 5,2019) రాత్రి 10 గంటలకు జైలుకి తరలించారు. రవిప్రకాశ్‌కు జైలు అధికారులు అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించారు. కృష్ణా బ్యారక్‌లో రవి ప్రకాశ్‌ను ఉంచారు. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్న ఆయన రాత్రంతా సరిగా నిద్రపోలేదని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఇక ఆయన బెయిల్ పిటిషన్‌పై అక్టోబర్ 9న వాదనలు జరగనున్నాయి.
రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారని ప్రస్తుత టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో… బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకి తరలించారు.
నిధుల మళ్లింపు వ్యవహారంలో శనివారం ఉదయం రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ABCL బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారని రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఉదయం నుంచి పలు ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు.
రవిప్రకాశ్, మూర్తి ఇద్దరూ చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేసినట్లుగా విచారణలో తేలింది. బోనస్, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లుగా కొత్త యాజమాన్యం గుర్తించింది. రికార్డుల తనిఖీల సమయంలో.. రవిప్రకాశ్ దోపిడీ బయటపడింది. రవిప్రకాశ్, మూర్తిపై సెక్షన్ 409, 418, 420, 509 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. టీవీ9 నిధులను బోర్డు సభ్యులకు తెలియకుండా మళ్లించటంపై ప్రశ్నించారు. రూ.18 కోట్ల వరకు అక్రమంగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఆధారాలతో సహా కంప్లయింట్ చేసింది టీవీ9 యాజమాన్యం. అనంతరం ఈ విషయంపై పోలీసులు అరెస్ట్ చేశారు.
చెక్ పవర్ దుర్వినియోగం చేసినట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త యాజమాన్యం రికార్డులు తనిఖీలు చేస్తుండగా ఈ మోసం వెలుగు చూసింది. డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు అనుమతి లేకుండా నిధులు డ్రా చేసినట్లు కొత్త యాజమాన్యం గుర్తించింది. క్లిఫోర్డ్ పెరీరాకు అక్రమంగా…రూ. 5.97 కోట్ల బోనస్‌ను రవి ప్రకాశ్ జారీ చేసినట్లు తెలిసింది.