చరిత్రలో తొలిసారి: సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు 

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 04:13 AM IST
చరిత్రలో తొలిసారి: సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు 

Updated On : May 2, 2019 / 4:13 AM IST

జేఈఈ-2019 మెయిన్స్‌లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. పాత రికార్డులను తిరగరాస్తూ తెలంగాణ కీర్తిని నలుదిక్కులకు విస్తరింపజేసేలా విద్యార్ధులు జాతీయ స్థాయిలో విజయ ఢంకా మోగించారు. జేఈఈ చరిత్రలోనే తొలిసారి తెలంగాణ విద్యార్ధులు 506మంది జేఈఈ-2019 మెయిన్స్‌లో ఉత్తీర్ణులు అయ్యారు. ఎస్సీ సంక్షేమ గురుకులాల నుంచి 307 మంది, ఎస్టీ సంక్షేమ గురుకులాల నుంచి 199 మంది విద్యార్థులు మే 27న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరిక్షకు అర్హత సాధించారు.

రజనీకేశ్ వర్ధన్ (98.4%), కొర్రా మహేష్(95.3%), తేజస్విని (93.4%), ప్రియసన్ (93.62%)  లు టాపర్లుగా నిలిచారు. బీసీ గురుకులాల పరిధిలో 44 మంది అర్హత పొందగా వీరిలో 31 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు అయిన విద్యార్ధుల తల్లిదండ్రులు మెజారిటీగా కూళీలు, రైతుల పిల్లలు కావడం విశేషం. వారి బ్యాక్‌గ్రౌండ్ అంతా గ్రామాలతోనే ముడిపడి ఉంది. కార్పోరేట్ వసతులు లేకపోయినా కార్పోరేట్ కాలేజీ విద్యార్ధులకు ధీటుగా వీరు ర్యాంకులు సాధించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.