ఆర్టీసీ సమ్మె : నవంబర్ 12 నుంచి నిరవధిక దీక్ష అశ్వత్థామరెడ్డి

  • Published By: madhu ,Published On : November 10, 2019 / 06:54 AM IST
ఆర్టీసీ సమ్మె : నవంబర్ 12 నుంచి నిరవధిక దీక్ష అశ్వత్థామరెడ్డి

Updated On : November 10, 2019 / 6:54 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరింత వత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ రెడీ అవుతోంది. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించింది. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ప్రతిపక్ష నేతలతో భేటీ ఆయ్యారు ఆర్టీసీ జేఏసీ నేతలు. సమావేశం ముగిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు.

> నవంబర్ 12వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్నట్లు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఇందులో అశ్వత్థామరెడ్డితో పాటు లింగమూర్తి, రాజిరెడ్డి, సుధలు దీక్షలో కూర్చొంటారని వెల్లడించారు.
> నవంబర్ 13 గురువారం, నవంబర్ 14వ తేదీ శుక్రవారం రోజుల్లో ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్, ఉమెన్ కమిషన్‌ను కలుస్తామన్నారు. ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అయినప్పటి నుంచి జరిగిన దమనకాండను వారికి వివరిస్తామన్నారు.
> ఓ ఫొటో ఎగ్జిబీషన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
> నవంబర్ 18వ తేదీ సోమవారం రాష్ట్రం మొత్తం రహదారుల దిగ్భంద కార్యక్రమం జరుగుతుందన్నారు. 

చర్చలకు ఆహ్వానించాలని, కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలన్నారు. సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యేలు, మంత్రులు ఒత్తిడి తీసుకరావాలని డిమాండ్ చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరోసారి కోరుతున్నామన్నారు. ఆర్టీసీ జేఏసీ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేతలు వీహెచ్, మల్లు భట్టి విక్రమార్క, సీపీఎం నేతలు తమ్మినేని, వెంకట్, సీపీఐ నేత చాడ, విమలక్క తదితర నేతలు పాల్గొన్నారు. 
Read More : ఆర్టీసీ జేఏసీ సమావేశం : మరోసారి తెలంగాణ బంద్ !