ఆర్టీసీ సమ్మె కుట్రపూరితం : ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సక్సెస్ : మంత్రి పువ్వాడ

  • Published By: madhu ,Published On : October 12, 2019 / 08:03 AM IST
ఆర్టీసీ సమ్మె కుట్రపూరితం : ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సక్సెస్ : మంత్రి పువ్వాడ

Updated On : October 12, 2019 / 8:03 AM IST

ఆర్టీసీ సమ్మె చేపట్టడం కుట్రపూరితమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితిని గమనించాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 12వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీకి లక్ష కోట్ల ఆస్తులున్నాయని వ్యాఖ్యానిస్తున్నారని, దీనికి సంబంధించిన డేటా ఉందా ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..(2014 నాటికి) రూ. 4 వేల 416 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఏనాడైనా చెప్పామా అని నిలదీశారు. ఆర్టీసీ బతలకాలంటే..మెరుగైన సేవలు అందించాలంటే..50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం హైర్ బస్సులు, 20 శాతం రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లను స్టేజ్ క్యారియర్లుగా అనుమతినిస్తామని చెప్పడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో ఆర్టీసీని లాభాల బాటలో తేలేదని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..కేసీఆర్..సంస్థను లాభాల్లోకి తెచ్చారని, 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం..మొన్న 16 శాతం హైఆర్ ఇవ్వడం జరిగిందన్నారు. 2004 కంటే ముందు..ప్రభుత్వాలు ఎలాంటి సపోర్టు ఇవ్వలేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామన్నారు. 

ఆర్టీసీని నడపాల్సిన కార్మికులు, కార్మిక నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. తప్పకుండా కొత్త కోణంలో ఆర్టీసీ ఉండబోతోందని, అక్టోబర్ 04వ తేదీన చెప్పిన విధంగా..విధుల్లో హాజరు కావాలని చెప్పినా.. కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మొత్తంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజల అవసరాలను తీరుస్తామన్నారు. డిపోలో ఉన్న బస్సులను బయటకు తీసుకొస్తామని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తామన్నారు. కుట్రపూరిత ఉద్దేశ్యంతో టికెట్ మెషిన్ ఇస్యూ చేయకుండా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి తీసుకెళ్లారన్నారు. కండక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చి టిమ్ మెషిన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. బస్సు ఛార్జీలు అధికంగా వసూలు చేస్తే..మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇష్యూ చేసిన బస్ పాస్‌లు అనుమతించడం జరుగుతోందన్నారు