సదర్ వెదర్ : 1600 కిలోల బరువు, 15 అడుగుల పొడవుతో సర్తాజ్

  • Published By: madhu ,Published On : October 27, 2019 / 06:19 AM IST
సదర్ వెదర్ : 1600 కిలోల బరువు, 15 అడుగుల పొడవుతో సర్తాజ్

Updated On : October 27, 2019 / 6:19 AM IST

హైదరాబాద్‌లో.. సదర్ వెదర్ షురూ అయిపోయింది. సిటీ మొత్తం.. సదర్ ఉత్సవాలకు రెడీ అయ్యింది. యాదవుల ఐక్యతను చాటి చెప్పడంతో పాటు పశువులను రక్షించాలనే మంచి సంకల్పంతో సదర్ జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో.. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేలిమి జాతి మహిషరాజాలు.. సదర్ సంబరాల్లో సందడి చేస్తాయి. అలా.. అక్టోబర్ 29న జరగబోయే సదర్ ఉత్సవాల్లో సత్తా చాటేందుకు వచ్చింది సర్తాజ్ మహిషరాజం. 27 కోట్ల ఈ దున్నపోతు.. నేషనల్ లెవెల్లో.. 25 సార్లు బహుమతులు గెలుచుకుంది. అందుకే.. ఈసారి హైదరాబాద్ సదర్ సంబరాల్లో.. సర్తాజ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలవబోతోంది.

హర్యానా నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు మూడున్నర లక్షలు ఖర్చయిందని చెబుతున్నారు. అసలు యజమాని పేరు వీర్ సింగ్. ఈ నెల 29న ముషీరాబాద్‌లో జరగబోయే సదర్ వేడుకల కోసం.. యాదవ సంఘం నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్.. సర్తాజ్ను హర్యానా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈసారి.. సిటీ మొత్తంలో.. సర్తాజ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందంటున్నారు. 

ఇక దీని విశేషాలకు వస్తే..1600 కిలోల బరువు, 15 అడుగుల పొడవుతో.. రాయల్ లుక్‌లో కనిపిస్తోంది సర్తాజ్. ఇద్దరు వ్యక్తులు.. దీని బాగోగులు చూసుకుంటారు. దీని తిండి కోసం.. రోజుకు 4 వేల దాకా వెచ్చిస్తున్నారు. రోజూ 15 కిలోల ఆపిల్స్‌, 20 లీటర్ల పాలు, కిలో బెల్లం, 2 కిలోల కందిపప్పు, శనగపప్పు, బాదాం, పిస్తా.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మెనూ లిస్ట్ బాగానే ఉంటుంది. సర్తాజ్కు రోజుకు 2 సార్లు స్నానం చేయిస్తారు. 5 కిలోమీటర్లు మార్నింగ్ వాక్‌కు తీసుకెళ్తారు. ఇప్పటివరకు నేషనల్ లెవెల్లో.. 25 సార్లు ఫస్ట్ గిఫ్ట్ పట్టేసిన సర్తాజ్కే.. సదర్ ఫిదా అవుతుందని చెబుతున్నారు.
Read More : భారీ చోరీలతో కలకలం : చెడ్డీ గ్యాంగ్ హల్ చల్