హైదరాబాద్ ఐకాన్ : చకచకా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

హైదరాబాద్ : హైదరాబాద్ కు మరో ఐకాన్ వస్తోంది. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. లేటెస్ట్ టెక్నాలజీలో GHMC నిర్మాణం చేపట్టింది. 2019 అక్టోబర్ లో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచంలో మూడో పెద్ద కేబుల్ బ్రిడ్జిగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిలవనుంది.
కేబుల్ బ్రిడ్జ్ వర్క్ లో అధికారులు బిజీ : దేశంలో గుజరాత్ బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జే ఇప్పటి వరకు అతి పెద్దది. జపాన్‌లో రెండు పెద్ద కేబుల్ బ్రిడ్జిలున్నాయి. వాటి తర్వాత హైదరాబాద్ లోనే అంత పెద్దది నిర్మాణం జరుగుతుంది. దుర్గం చెరువు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో.. 754.38 మీటర్ల పొడవున నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే 60శాతం వర్క్ కంప్లీట్ అయ్యింది.
కేబుల్ బ్రిడ్జి స్పెషాలిటీస్ :
కేబుల్ బ్రిడ్జి ఎత్తు : 20 మీటర్లు
పొడవు- 754.38 మీటర్లు
నిర్మాణ ఖర్చు : రూ.184 కోట్లు
అత్యాధునిక టెక్నాలజీ
వంతెన ఎత్తు తగ్గించటం ద్వారా.. చెరువుకు రెండు వైపులా, చెరువు మధ్యలో బ్రిడ్జికి పిల్లర్‌ను నిర్మించకుండానే పూర్తి చేయనున్నారు.
- ఎక్స్‌ట్రా డోస్డ్ టెక్నాలజీలో 75 మీటర్లకు బదులుగా 57 మీటర్ల ఎత్తులోనే పిల్లర్ల నిర్మాణం
- ఈ టెక్నాలజీలో కేబుల్ బ్రిడ్జి నిర్మించడం ప్రపంచంలో ఇది మూడోది.
- హైదరాబాద్‌లో తొలి హ్యాంగింగ్ బ్రిడ్జి దుర్గం చెరువుదే..
- ఆస్ట్రియా నుంచి స్టే కేబుళ్లు దిగుమతి
- 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తుతో మెయిన్ ప్రీ కాస్టింగ్ నిర్మాణాలు
- కొండాపూర్‌లో బ్రిడ్జికి సంబంధించిన ప్రీ కాస్టింగ్ నిర్మాణ పనులు
కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రయోజనాలు
- హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఇది ప్రత్యేక ఐకాన్‌గా నిలుస్తుంది.
- జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36, మాదాపూర్‌పై ట్రాఫిక్ తగ్గుతుంది.
- జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలికి రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
సిగ్నల్ ఫ్రీ కారిడార్..
హైదరాబాద్ సిటీలో ఐటీ పరిశ్రమలు హైటెక్ సిటీ, మాదాపూర్ చుట్టూనే ఉన్నాయి. పంజాగుట్ట, ఎల్‌బీ నగర్, ఉప్పల్ నుంచి లక్షల మంది వస్తారు. అటు నుంచి ఇటు వెళ్లేందుకు NFCL నుంచి ఖాజాగూడ వరకు సిగ్నల్స్ లేకుండా వెళ్లేందుకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కేబీఆర్ జంక్షన్ చుట్టూ ఫ్లై ఓవర్లు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్, ఇనార్బిట్ మాల్ నుంచి ఖాజాగూడ టన్నెల్‌తో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కూడా ఉంది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్, మాదాపూర్ లో ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది.