తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త

  • Published By: madhu ,Published On : November 2, 2019 / 03:29 PM IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త

Updated On : November 2, 2019 / 3:29 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు తీపివార్త వినిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక డీఏ ఇవ్వాల్సిన అవసరం ఉందని..అది ఇచ్చేసినట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్. 2019, నవంబర్ 02వ తేదీ సాయంత్రం ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 49 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు తెలియచేశారు.

నూతనంగా ఏర్పడిన రాష్ట్రం..అన్ని రంగాల్లో చాలా పటిష్టంగా ముందుకెళుతోందని..భవిష్యత్‌లో తలనొప్పులు..ఇబ్బందులు లేకుండా..పాలన జరగాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఆర్థిక మాంద్యం రాష్ట్రంపై ప్రభావం చూపుతోందని, కానీ నెగటివ్‌‌గా లేదన్నారు. ఐదు సంవత్సరాల్లో 21 శాతంగా ఉంటే..ప్రస్తుతం..16 శాతం తగ్గి 5 శాతంగా ఉందన్నారు..కానీ మైనస్‌లో పోవడం లేదన్నారు.

ట్రాన్స్ పోర్టు విషయంలో వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఎక్సైజ్‌లో కొత్త పాలసీ విధానం వల్ల రూ. 975 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ వెళుతున్నామన్నారు. చాలా తపన పడి..చావు అంచుల దాక వెళ్లి..రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అత్యంత ప్రేమగా చూస్తానని వెల్లడించారు. మొదటి టర్మ్‌లో 63 ఎమ్మెల్యేలతో గెలిస్తే..25 మంది ఎమ్మెల్యేలు జోడించి..3/4 మెజార్టీతో ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఘన విజయం సాధించి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్, ప్రజల భవిష్యత్ గురించి ఆలోచిస్తామని వెల్లడించారు 
Read More : ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ : సమ్మె చట్ట విరుద్ధం – కేసీఆర్