ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఫేవరేట్ జట్టు క్రికెటర్లు ఆడే మ్యాచ్ లను చూసేందుకు ఎగబడుతుంటారు. ఐపీఎల్ లైవ్ మ్యాచ్ వస్తుందంటే.. టీవీలకు అంటుకుపోతారు.

  • Published By: sreehari ,Published On : April 8, 2019 / 08:43 AM IST
ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు

Updated On : April 8, 2019 / 8:43 AM IST

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఫేవరేట్ జట్టు క్రికెటర్లు ఆడే మ్యాచ్ లను చూసేందుకు ఎగబడుతుంటారు. ఐపీఎల్ లైవ్ మ్యాచ్ వస్తుందంటే.. టీవీలకు అంటుకుపోతారు.

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఫేవరేట్ జట్టు క్రికెటర్లు ఆడే మ్యాచ్ లను చూసేందుకు ఎగబడుతుంటారు. ఐపీఎల్ లైవ్ మ్యాచ్ వస్తుందంటే.. టీవీలకు అంటుకుపోతారు. స్మార్ట్ ఫోన్లలో ఎప్పటికప్పుడూ లైవ్ స్కోర్ అప్ డేట్స్ చూస్తుంటారు. మరికొందరు మ్యాచ్ స్కోర్ అప్ డేట్స్ ఏంటని అందరిని అడుగుతుంటారు. కాలేజీలో ఉన్నా.. ఆఫీసుల్లో ఉన్నా.. డ్రైవింగ్ చేస్తున్నా ఐపీఎల్ ఫేవరేట్ జట్టు లైవ్ స్కోర్ అప్ డేట్స్ చూడాల్సిందే.
Read Also : పొల్లాచిలో వరుస హత్యలు.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్

లేదంటే మనస్సు ఊరుకోదు. ఐపీఎల్ ప్రియులకు ఇది కామన్. ప్రస్తుతం.. ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఇప్పటికే ఐపీఎల్ 8 జట్లు పలు మ్యాచ్ ల్లో ఆడుతూ టైటిల్ కొట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ప్రతిరోజు ఐపీఎల్ మ్యాచ్ ఇంట్లో టీవీ ముందే చూడాలంటే కుదరని పని.. ఏదొక పని ఉంటుంది. బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఫేవరేట్ జట్టు మ్యాచ్ లైవ్ మిస్ అవుతున్నామనే ఫీల్ అవుతుంటారు. కదా..

ఐపీఎల్ అభిమానుల కోసం హైదరాబాదీ ట్యాక్సీవాలా వినూత్నంగా ఆలోచించాడు. తన ట్యాక్సీ టాప్ రోఫ్ పై ఏకంగా ఐపీఎల్ లైవ్ స్కోర్ డిసిప్లే చేశాడు. ట్రాఫిక్ లో ఉన్నా.. రోడ్డుపై వెళ్లే ఐపీఎల్ ఫ్యాన్స్ ఐపీఎల్ లైవ్ స్కోరు చూసుకోవచ్చు. ఈ ట్యాక్సీవాలా ఐడియాను ఐపీఎల్ అభిమానులు అదిరింది ఐడియా అంటూ.. తెగ మెచ్చుకుంటున్నారు. ట్యాక్సీవాలా లైవ్ స్కోరు ఫొటో రెడిట్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు.. అమ్మయ్యా.. మా మొబైల్ డేటా సేవ్ అయింది.. థ్యాంక్స్ ట్యాక్సీవాలా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
Read Also : హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ రిలీజ్