గ్రామ బాట : మన ఊరును మనమే బాగు చేసుకోవాలి – సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : August 31, 2019 / 01:09 AM IST
గ్రామ బాట : మన ఊరును మనమే బాగు చేసుకోవాలి – సీఎం కేసీఆర్

Updated On : August 31, 2019 / 1:09 AM IST

సెప్టెంబరు 6వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజలు పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో పంచాయతీరాజ్‌ శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. 60 రోజుల పల్లె ప్రణాళికను 30 రోజుల చొప్పున రెండు దశల్లో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో వచ్చే నెల 3న సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏండ్లు గడిచినా..గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్బరంగానే ఉందన్న సీఎం కేసీఆర్..మన ఊరును మనమే బాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఊరి పరిస్థితిని మార్చుకోవాలని..పనిచేసే గ్రామ పంచాయతీ వ్యవస్థను తయారు చేయడం కోసమే కొత్త పంచాయతీ రాజ్ చట్టం వచ్చిందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందన్నారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కలిసి పనిచేసి గ్రామాలను మార్చుకొనే సంస్కృతి అలవాటు కావాలన్నారు. ప్రత్యేక కార్యాచరణ క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు మార్గదర్శనం చేసేందుకు సెప్టెంబర్ 03న హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.