మియాపూర్ భూముల జోలికి వెళ్లొద్దు : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 08:06 AM IST
మియాపూర్ భూముల జోలికి వెళ్లొద్దు : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Updated On : April 16, 2019 / 8:06 AM IST

హైదరాబాద్ మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

హైదరాబాద్ మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సేల్ డీడ్ రద్దు ఎలా చేస్తారని ప్రశ్నించింది. రద్దు ఉత్తర్వుల నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం మియాపూర్ భూములపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్కో ఆర్డర్ జారీ చేసింది. 
Read Also : మహిళను ఈడ్చుకెళ్లిన మెట్రో రైలు : తలకు తీవ్రగాయాలు

అప్పటి వరకు మియాపూర్ భూములను ప్రభుత్వం కొనడం..ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మియాపూర్ భూముల విషయంలో కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాటిని రద్దు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై కోర్టు సానుభూతితో వ్యవహరించదని వ్యాఖ్యానించింది. 
Read Also : ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలపై సుప్రీంకోర్టులో పిటిషన్