తెలంగాణ లోక్ సభ ఎన్నికలు : 62.53 శాతం పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 62.53 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం రాత్రి ఈ ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 62.53 శాతం పోలింగ్ నమోదైందని తెలిపింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం, తుది లెక్కల వివరాలను ప్రకటించింది.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం
నియోజకవర్గాలు | పోలింగ్ శాతం |
మల్కాజ్ గిరి | 49.53 |
మెదక్ | 71.72 |
జహీరాబాద్ | 69.67 |
నిజామాబాద్ | 68.33 |
పెద్దపల్లి | 65.43 |
కరీంనగర్ | 66.59 |
ఆదిలాబాద్ | 71.45 |
ఖమ్మం | 75.18 |
వరంగల్ | 63.65 |
మహబూబాబాద్ | 69.04 |
నాగర్ కర్నూలు | 62.29 |
నల్లగొండ | 74.11 |
భువనగిరి | 74.39 |
సికింద్రాబాద్ | 46.26 |
హైదరాబాద్ | 44.75 |
చేవెళ్ల | 53.22 |
మహబూబ్ నగర్ | 65.39 |