హమ్మయ్య : చలి తగ్గింది

హైదరాబాద్ : మొన్నటి వరకు చలి..చలి అంటూ బాధ పడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా ప్రాంతంలో ‘తుపాన్ వ్యతిరేక గాలులు’ ఏర్పడడంతో తేమ గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు బంగాళాఖాతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనవరి 06, జనవరి 07వ తేదీల్లో ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ తుపాన్ వ్యతిరేక గాలులు బలహీనమయితే మాత్రం…చలి గాలులు బలంగా వీస్తాయని..తద్వారా చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.