73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఆటంకాలు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేసింది. జులై 7 జారీ చేసిన నోటిషికేషన్ ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల లిస్ట్ సవరణలను మరోసారి చేపట్టాలని..ఎన్నికల సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి అభ్యంతరాలు..సవరణల్ని 14 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విషయంపై ప్రభుత్వం కోర్టుకు సమాధానమిస్తూ..మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కు వార్డుల విభజన ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదనీ తెలిపింది.
కాగా..మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జగరలేదనీ..వార్డల విభజన, రిజర్వేషన్లు, ఓటర్ల లిస్ట్ తయారీలో లోపాలున్నాయంటూ 67 మున్సిపాలిటీలకు సంబంధించి 76 పిటీషన్లు దాఖలవ్వటంతో..మున్సిపల్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటీషన్లపై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గురువారం (నవంబర్ 29) మరోసారి విచారణ చేపట్టగా..ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు మున్సిపల్ ఎన్నికలపై మరోసారి విచారణ చేపట్టిన అనంతరం 73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేసింది.