తెలంగాణ తొలి తరం ఉద్యమ నేత ఆమోస్ కన్నుమూత

సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేశారు.
1969లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన జైలుకు కూడా వెళ్లివచ్చారు. అప్పటి సర్కార్ ఆయనను డిస్మిస్ కూడా చేసింది. తెలంగాణ కోసం ప్రభుత్వ ఉద్యోగం తొలగించబడ్డ తొలి ఉద్యమకారుడు ఆమోస్. టీఎన్‌జీవో అధ్యక్షుడిగా ఆమోస్ పనిచేశారు. ఆమోస్ మృతిపట్ల సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేశారు.