పొడి వాతావరణం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. చలి కూడా తక్కువగా ఉంటుడడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఏర్పడిన తుపాన్ వ్యతిరేక గాలులు ఉత్తరాది శీతలగాలులు అడ్డుకోవడం వల్ల పొడివాతావరణం ఏర్పడుతోందని వాతావారణ అధికారులు వెల్లడిస్తున్నారు. తూర్పు, ఈశాన్య భారతం నుండి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని…పగటి పూట సాధారణం కన్నా కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వెల్లడించారు. రాత్రి వేళల్లో చలి సాధారణస్థాయిలోనే నమోదవుతోందన్నారు.