టి. అసెంబ్లీ : కళ్యాణ లక్ష్మీ పథకంలో అవినీతి లేదు – గంగుల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో కళ్యాణ లక్ష్మీ ఒకటి అని, ఈ పథకంలో ఎలాంటి అవినీతి జరగడం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి. పేద తల్లిదండ్రులకు భారం కాకుడదనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని, పథకానికి సంబంధించిన డబ్బులు దశల వారీగా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 21వ తేదీ శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలుపై సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. పథకం అమలులో ఆన్‌లైన్‌లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వ అధికారులను భాగస్వాములు చేసినట్లు, పథకం పారదర్శకంగా కొనసాగుతోందన్నారు.
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ ఆలస్యం అవుతోందని సభ్యులు ప్రస్తావించారు. బీసీల్లో ఎక్కువ డిమాండ్ ఉందని, బడ్జెట్‌లో రూ. 700 కోట్లు పెట్టడం జరిగిందన్నారు. బడ్జెట్ సమావేశాలు, ఇతరత్రా కారణాలతో డీలే అయిన మాట వాస్తవమేన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని, పథకాల అమలు వల్ల బాల్యవివాహాలు తగ్గాయన్నారు మంత్రి గంగుల.
Read More : బాంబుల్లా పేలుతున్నాయి : జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం