16 సీట్లే లక్ష్యం : మళ్లీ ప్రచారంలోకి KCR

ప్రచారానికి గడువు రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. దీంతో.. అన్ని పార్టీల నేతలూ స్పీడ్ పెంచేశారు. ఓవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే ర్యాలీల్లో పాల్గొంటున్నారు.

  • Published By: madhu ,Published On : April 6, 2019 / 12:10 PM IST
16 సీట్లే లక్ష్యం : మళ్లీ ప్రచారంలోకి KCR

Updated On : April 6, 2019 / 12:10 PM IST

ప్రచారానికి గడువు రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. దీంతో.. అన్ని పార్టీల నేతలూ స్పీడ్ పెంచేశారు. ఓవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే ర్యాలీల్లో పాల్గొంటున్నారు.

ప్రచారానికి గడువు రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. దీంతో.. అన్ని పార్టీల నేతలూ స్పీడ్ పెంచేశారు. ఓవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే ర్యాలీల్లో పాల్గొంటున్నారు. 16 ఎంపీ సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న TRS అధినేత కేసీఆర్ కూడా… ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారు. 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 11 బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్.. టీఆర్ఎస్‌కు 16 సీట్లు ఎందుకు కట్టబెట్టాలో వివరించారు. అలాగే.. పార్టీ అభ్యర్థులను భారీ మెజారీటీతో గెలిపించాలంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. 
Read Also : భువనగిరి ఖిల్లాపై ఎగిరేది ఎవరి జెండా ?

ఇక రెండు రోజులు ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్.. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఈ రెండు రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. అభ్యర్థులు ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారనే అంశాలపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన కేసీఆర్.. ఎక్కడ బలహీనంగా ఉన్నారు. ఏ ప్రాంతంలో ఎంత పుంజుకోవాలనే విషయాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. 

చివరి విడత ప్రచారంలో ఆదివారం, సోమవారం నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో జరిగే ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ రెండు, మూడు రోజులు.. కేంద్రంపైనే ఎక్కువగా విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మోడీ ఐదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని… రాష్ట్ర పథకాలను కాపీ కొడుతున్నారనే విషయాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. రెండు జిల్లాలతో పాటు.. గ్రేటర్‌ పరిధిలో కేసీఆర్ రోడ్ నిర్వహించే అవకాశం ఉంది. దానికి కోసం పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. 
Read Also : అందుకే హైదరాబాద్ నుంచి వచ్చేశా