హైదరాబాద్ సిటీలో జూన్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీలో నెల రోజులు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అడిషనల్ కమిషన్ అనిల్ కుమార్ తెలిపారు. MM సివరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలో నారాయణగూడ పరిధిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మూడు చోట్ల 1800 ఎంఎం సివరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు మే 4 నుంచి జూన్ 6వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
నారాయణగూడ సెమెట్రీ గేట్ నెంబర్ ఒకటి నుంచి గేట్ నెంబర్ 2, నారాయణగూడ సెమెట్రీ గేట్ నెంబర్ 2 నుంచి విఠల్‌వాడీ, రాజమెహల్లా దర్గా నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్స్ వరకు MM సివరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ, కింగ్ కోఠికి సెమెట్రీ ద్వారా వెళ్లే వెహికల్స్ కు పర్మిషన్ ఉండదు. ఆ ప్రాంతంలోని వాహనదారులు ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్, హైదర్‌గూడ వైపు వెళ్లాలి.
- కింగ్‌కోఠి నుంచి ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లే వాహనాలను సెమెట్రీ జంక్షన్ దగ్గర విఠల్‌వాడీ వైపు మళ్లిస్తారు.
- విఠల్‌వాడీ, రాంకోఠి వైపు నుంచి ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వెళ్లే వాహనాలను సెమెట్రీ జంక్షన్ నుంచి ఈడెన్ గార్డెన్, కింగ్‌కోఠి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- YMCA నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్డుకు వెళ్లే వాహనాలను బర్కత్‌పురా చమాన్, విఠల్‌వాడీ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- రాంకోఠి Xరోడ్స్, నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లే వాహనాలు కాచిగూడ ఎక్స్ రోడ్డు దగ్గర వైఎంసీఏ, బర్కత్‌పురా పోస్టాఫీస్, బర్కత్‌పురా చమాన్, టూరిస్ట్ హోటల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.