JC Prabhakar Reddy : మేము మొదలుపెడితే మీరు తట్టుకోలేరు.. వాళ్లకు జేసీ దివాకర్ రెడ్డి వార్నింగ్

JC Prabhakar Reddy : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

JC Prabhakar Reddy : మేము మొదలుపెడితే మీరు తట్టుకోలేరు.. వాళ్లకు జేసీ దివాకర్ రెడ్డి వార్నింగ్

JC Prabhakar Reddy

Updated On : October 20, 2025 / 5:16 PM IST

JC Prabhakar Reddy : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు.. ఇదే లాస్ట్ దీపావళి అంటే.. మేము చూస్తూ ఊరుకోవాలా..? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అంటూ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి.. నీకు భవిష్యత్తు చాలా ఉంది.. దాన్ని నాశనం చేసుకోకు అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు.

Also Read: Happy Diwali 2025 : దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ 7 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

నా ఆయుష్ గురించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెబుతున్నాడు.. మూడేళ్లు బతుకుతాడు అని చెబుతున్నాడు. దేవుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా జరగొచ్చు. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడూ ఎమ్మెల్యే కాలేడు అంటూ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిన్నవాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి అతనికి మళ్లీ ఎమ్మెల్యే అయ్యేందుకు అవకాశం ఉండొచ్చునని జేసీ పేర్కొన్నారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై జరుగుతున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముంది. సెంట్రల్ రైలు సర్వీసులు ప్రైవేటీకరణ చేయలేదా..? వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏమి చేస్తున్నారు..? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

మాజీ మంత్రి శైలజానాథ్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడు. నీకు ఈసారి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోలేవు. అనంతపురం జిల్లాలో కోవిడ్ సమయంలో అదుపు చేసింది ఒక్క ఆర్డిటి సంస్థ మాత్రమే అది ప్రైవేట్ కాదా…? అని అన్నారు.